అతివేగం..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది. ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ బ్రాంచ్ SI తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ మృతిచెందారు. వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ SI గా పనిచేస్తున్న మహ్మద్ ఖలీల్ పాషా విధులు ముగించుకుని నార్సింగ్ లోని ఇంటికి బయలుదేరాడు. అప్పాలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్స్ మమత, కీర్తిలను కారులో ఎక్కించుకున్నాడు. హిమాయత్ సాగర్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఖలీల్ పాషా అక్కడిక్కడే మృతిచెందగా... గాయపడిన కీర్తి ఆసుపత్రిలో మృతిచెందింది. తీవ్ర గాయాలైన మమతను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మమత పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు