ఎండ ధాటికి దగ్దమైన ద్విచక్ర వాహనం ..

50"c  ఎండ తీవ్రత ధాటికి ద్విచక్ర వాహనం దగ్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండ ధాటికి ద్విఛక్రవాహనం దగ్దమైన సంఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన బూదూరి లక్ష్మయ్య , లలిత దంపతులు. పాల్వంచ లో జరిగే వివాహానికి వెళుతున్నారు...ఈ క్రమంలో వినోభానగర్ గ్రామం సమీపంలోకి రాగానే  వారి వాహనానికి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.క్షణాల్లో టీవీయస్ యాక్టీవా వాహనం దగ్దమైంది...భయబ్రాoతులకు గురైన దంపతులు వాహనాన్ని వదిలి పొలాల్లోకి పరుగులు పెట్టారు.వాహనం లోని రూ.3000 రూపాయల నగదు, దుస్తులు దగ్దమైనట్లు భాదితులు తెలిపారు.

YOU MAY LIKE