సెలవులొచ్చాయ్..

వరుసగా నాలుగు రోజులు సెలవు రావడంతో రాజధానివాసులు సొంత వూరి బాట పట్టారు. ఈ నెల 12 నుంచి 15 వరకు వరుసగా సెలవులు రావడంతో రాష్ట్రంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. అటు శ్రావణమాసం పెళ్లిళ్లు కూడా తోడవ్వటంతో దూర ప్రాంత ప్రయాణీకులు సీట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో సీట్లు దొరకని ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో సొంత వూర్లకు పయనమయ్యారు