హెచ్చరిక ... భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శాఖ అధికారులు తెలిపారు. కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని శాఖ అధికారులు వెల్లడించారు. మరో వారం రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించారు