వైభవంగా గురుపౌర్ణమి.....

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో సాయిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని దివ్యక్షేత్రం షిర్డీలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి, భక్తులు పెద్ద ఎత్తున  ఆలయానికి చేరుకున్నారు.విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని సాయి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట సాయిబాబా ఆలయాల వద్ద భక్తుల క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు.