కన్యాశుల్కం నాటకం '125 ఏళ్లు' ... !

మహాకవి గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరంలో 3రోజులపాటు నిర్వహించిన జాతీయ ఉత్సవాలు ముగిశాయి. ఈసందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురజాడ రచనలు, గేయాలు జాతి మణి రత్నాలని మంత్రి అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టికాదోయ్‌..గేయం దేశభక్తిని తెలియజేస్తుందన్నారు.  కన్యాశుల్కం రజత ఫలకాన్ని, 125 ఏళ్ల ఉత్సవ సావనీర్‌ను మంత్రి గంటా ఆవిష్కరించారు.

YOU MAY LIKE