అత్యవసర సమావేశం..

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చిన్న పిల్లల మరణాలు కొనసాగుతున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా గోరఖ్ పూర్ వైద్య కళాశాలలో ఇప్పటికే 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తెల్లవారు జాము నుంచి మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆసుపత్రిని సందర్శించి ఆక్సిజన్ కొరతకు కారణాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు

YOU MAY LIKE