యువతీ,యువకుడు అరెస్ట్.. భారీగా గంజాయి స్వాధీనం...

కృష్ణా, జిల్లా పోలీసులు గురువారం ఓ యువతి, యువకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం పొట్టిపాడు చెక్‌పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ యువతీయువకులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. అనంతరం కారులో 180 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనకాపల్లి నుంచి నాసిక్‌ కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

YOU MAY LIKE