విఘ్నేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు

ఫిలింనగర్‌ దైవసన్నిధానం ఆలయంలో ఉగాది సందర్భంగా అద్భుతం చోటు చేసుకుంది. ఆలయంలో కొలువు దీరిన విఘ్నేశ్వర స్వామి మీద తొలిసారిగా సూర్యకిరణాలు ప్రసరించాయి. ఉదయం స్వామివారికి అభిషేకం, విశేష పూజలు పూర్తయిన తర్వాత సూర్యకిరణాలు స్వామివారి మీదపడటంతో ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉగాది పర్వదినం రోజు ఇలాంటి ఘటన జరగడం శుభపరిణామం అని అందరూ చెప్పుకున్నారు. 

 

YOU MAY LIKE