భళా భానుమతి..

తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌‌లో కూడా ఓ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తోంది ఫిదా మూవీ. కుటుంబ కథా చిత్రాలకు కలెక్షన్లు ఏరేంజ్ లో వస్తాయనేది మరోసారి తేల్చి చెప్పందీ మూవీ. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది ఓవర్సీస్ కలెక్షన్లను కూడా దాటేసి నయా రికార్డులు సృష్టిస్తోంది. మూడో వీకెండ్‌ వచ్చేసరికి 1.97 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఫిదా.. లాంగ్‌ రన్‌లో కనీసం 2.3 మిలియన్ డాలర్లను దాటగలదని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ 10 లిస్ట్ మారిపోయింది. ప్రస్తుతం 7 వ స్థానంలో వున్న ఫిదా 6వ స్థానానికి చేరుకుంటుందని  అంచనా వేస్తున్నారు.
 

YOU MAY LIKE