ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ..

 షాలిని పాండే, విజయ్‌ జంటగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత షాలిని పలు చిత్రాలకు సంతకాలు చేశారు. ఆమె బుధవారం ఓ మొబైల్‌ షాప్ ని ప్రారంభించడానికి నెల్లూరు వెళ్లారు. అక్కడ కొద్దిగా అస్వస్థతగా అనిపించి, ఆసుపత్రికి వెళ్లారు. ఈ విషయం కాస్త బాగా వైరల్‌ అయ్యింది.

 తన ఆరోగ్యం గురించి షాలిని బుధవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. తనకు కొంచెం తలనొప్పి, జ్వరంగా ఉండి సాధారణ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ మీడియా, ప్రజలకు కనపడకుండా కవర్‌ చేసుకున్నానని, దీనికి మించి ఇంకేమీ లేదని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘మహానటి’ చిత్రంలో నటిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ‘అవును.. నటిస్తున్నా’ అని షాలిని చెప్పారు. తన పాత్ర ఏదో ఇప్పుడే చెప్పనన్నారు. కొన్ని సినిమాలకి సంతకం చేశానని, వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు.

‘ టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ అని షాలిని తెలిపారు.

YOU MAY LIKE