నకిలీ డాక్టర్ భాగోతం...

విజయవాడలో నకిలీ డాక్టర్ భాగోతం బయటపడింది. నగరానికి చెందిన గర్రే శంకరరావు సూర్యారావుపేటలో సిమ్స్ ఆసుప్రతిని నడుపుతున్నాడు. మానసిక నిపుణుడిగా చలామణీ అవుతూ పేషేంట్ల దగ్గర కౌన్సిలింగ్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. అనేక మందిని మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. శంకరరావు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి వైద్యుడిగా చలామణీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శంకరరావును పూర్తిస్థాయిలో విచారించి..తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

YOU MAY LIKE