ఆయనలోని ప్యాక్షనిజాలు ... !

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు  ఆయనలోని ప్యాక్షనిజాన్ని తెలియజేస్తున్నాయని పల్లె అన్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలంటూ ఆయన కోరారు. పట్టపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన సందర్భంగా పల్లె ఈ వ్యాఖ్యలు చేశారు.