ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం ...

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 36 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా... అదే ట్రాక్ పై వేగంగా వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు

YOU MAY LIKE