దసరాకే ఫస్టులుక్..!

అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా ఫస్టులుక్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 ఈ నేపథ్యంలో దసరాకి ఫస్టులుక్ ను రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

YOU MAY LIKE