హమ్మయ్య..

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు వేర్వేరు విమానాల రెక్కలు ఒకదానికొకటి రాసుకున్నాయి. విమానాల ఇంజిన్లు ఆఫ్ చేసి ఉండటంతో ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఆగి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం రెక్కలు తాకాయి. ఇథియోపియన్ విమానాన్ని ట్రాక్టర్ సహాయంతో వెనక్కి తీసుకెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన అనంతరం ఇథియోపియా వెళ్లాల్సిన విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు