మంత్రి లేకుండా సమావేశం

           ప్రతియేటా దసరా పండుగను ఇంద్రకీలాద్రి పై ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకకు సంబందించిన అన్ని ఏర్పాట్లను అధికారిక సమన్వయ కమిటీ నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది కూడా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దసరా పండగ ఉత్సవాలు అధికారిక సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశం లో దసరా ఏర్పాట్ల గురుంచి చర్చించుకుంటారు. అయితే ఈ దసరా ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి పైడిపల్లి మాణిక్యాలరావు కి ఆహ్వానం అందలేదు. అందువల్ల మంత్రి మాణిక్యాలరావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మంత్రి హాజరు కానప్పటికీ దసరా ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

YOU MAY LIKE