భూగర్భజలాలను కాపాడుకుందాం...సీఎం

నదులను కాపాడుకోవల్సిన బాధ్యత దేశ ప్రజలదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  నదులంటే అందరికీ భక్తిభావమని.. వాటిని పూజించుకోవడం వారసత్వంగా వస్తోందని చెప్పారు. నదుల అనుసంధానం తాత్కాలిక చర్య అని.. నదుల పునరుజ్జీవమే శాశ్వత చర్య అని పేర్కొన్నారు.  రాయలసీమ,  కోస్తాలో  ఉన్న 39 నదులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. భూగర్భజలాలను కాపాడుకోవడానికి వేల చెరువులు తవ్వామన్నారు.

YOU MAY LIKE