ఇసుక రేవులో వివాదం...

రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ లో ఇసుక రవాణాకు సంబంధించి రెండు వర్గాల మద్య వివాదం నెలకొంది. గురువారం ఉదయం నుంచి  రేవులో కార్యకలాపాలు స్ధంభించి పోయాయి. లారీలను తీసుకు వచ్చి ఓ వర్గం ఇసుక మాకు వెయ్యాలని రేవులో నిర్వహాకులను విజ్ఞప్తి చేశారు. బయిటనుంచి వచ్చే లారీలకు ఇసుక లోడ్ చేసేది లేదని నిర్వాహకులు వెల్లడించడంతో లారీల యజమానులు తీవ్ర స్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లారీలలో ఇసుక లోడు చేయక పోతే కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. ఇసుక రేవులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రేవుతో సంబంధం లేకుండాబయిట నుంచి లారీలు వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించడం వల్ల చెడ్డపేరు వస్తోందని ఒక వర్గం వారు వాదిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఇసుకను లారీలలో తీసుకు వెళ్ళడం వల్ల రాజమహేంద్రవరంలో ఇసుక కొరత ఏర్పడి డిమాండ్ పెరిగిపోతోందని, ప్రభుత్వ నిర్ణయించిన ధరకంటే ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.రేవులో ఏక పక్షంగా వ్యవహరిస్తూ లారీలు తీసుకు వచ్చినా ఇసుక లోడులు వేయడం లేదని మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. ఇసుక కేవలం కొంతమందికేనా..అందరికీ కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా రేవులనిర్వహాకులే ఇసుక ను మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈనేపధ్యంలో  నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ రేవు వద్దకు చేరుకుని ఇరువర్గాలకు నచ్చ చెప్పారు. రేవులో లారీలు బయిటకు రాకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఏమైనా ఉంటే మాట్లాడుకుందామన్నారు. అంతే కానీ ఇలా రేవులో కార్యకలపాలకు అడ్డు తగలడం మంచి విధానం కాదని హితవు పలికారు.అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. సమస్యపరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు.

YOU MAY LIKE