ప్రారంభం ముందురోజు థియేటర్‌ దగ్ధం..

ప్రకాశం జిల్లా కేంద్రంలోని సురేష్ మహల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతదిగా ఉన్న ఈ మహల్ ను ఆధునికరించేదుంకు చేపట్టిన పనులలో షార్ట్ సర్కూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా ఎగసి పడ్డప్పటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ల సహయంతో మంటలను అదుపుచేశారు.