ట్రాఫిక్ కు చెక్ !

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలు మారుస్తున్న ట్రాఫిక్ పోలీసులు... అదే రూల్స్ ను సొంత శాఖలోను అమలు చేస్తున్నారు. పోలీసు శాఖకు చెందిన వారు రూల్స్ పాటించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 242 మంది సిబ్బందికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. నియమాలు మాకేనా... మీకు లేవా అంటూ సామాన్యులు ప్రశ్నించకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అని సిబ్బందికి సూచిస్తున్నారు