చాందిని హత్య...కనిపించని మరో నిందితుడు !!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు అమీన్ పూర్ లో విద్యార్ధిని హత్య. ఈ నెల 9 వ తేదీన మిస్ అయిన చాందిని అనే విద్యార్ధిని మిస్ అయ్యింది పోలీసుల ఎంక్వైరీలో ఆ అమ్మయి మర్డర్ కు గురయినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెబుతున్న కమిషనర్ సందీప్ శాండిల్య సైతం సామాజిక మాధ్యమాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మర్డర్ కు ప్రధాన కారణం ఫేస్ బుక్ వల్ల కలిగిన మనస్పర్ధలు,ఇగో లో ఆయన స్పష్టం చేసారు. 
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాందిని, సాయి కిరణ్ ఇద్దరు 6వ తరగతి నుంచి 10 వతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆసమయంలోనే ఒకరికొకరు ఇష్టపడ్డారు.  చాందిని అక్కడే కంటిన్యూ కాగా కిరణ్ వేరే కాలేజీల్లో చేరాడు. అయితే ఇటీవల చాందిని వేరే యువకులతో ఫేస్ బుక్ లో సన్నిహితంగా ఉంటోంది. వాళ్లతో దిగిన ఫోటోలను ఫేస్ బుక్ లో పెడుతోంది. ఈ విషయంలో ఇరువురి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. అయితే ఈ నెల 1 నుంచి 3 వ తేదీ వరకు నగరంలోని ఒక హోటల్ లో 60 మంది యువతి యువకులు కలుసుకున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే వారెవరు స్నేహితులు కారు. వారంతా ఫేస్ బుక్ లో ఒక పేజి ద్వారా కలుసుకున్న వ్యక్తులు మాత్రమే.

YOU MAY LIKE