చైన్ స్నాచింగ్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సీసీ టీవీ ల కారణంగా కొంత స్నాచింగ్ తగ్గుముఖం పట్టినా దొంగతనాలు మాత్రం చెయ్యకుండా ఉండలేకపోతున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివరాంపల్లి లో  సీనీ ఫక్కీలోనే ఓ చోరి జరిగింది. బ్యాంకు పని మీద బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న విజయమ్మ ఆటోదిగి నడుస్తుంది. ఇంతలోనే బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు విజయమ్మను ఆపి మేము పోలీసులము, దొంగలతో జాగ్రత్త అంటూ హితవు పలికారు. ఇంతలోనే మెడలో వున్న చైన్ తీసి బ్యాగ్ లో పెట్టుకోబోయ్యింది . అదే అదునుగా భావించిన దుండగులు గొలుసును లాక్కుని పరారయ్యారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు  సీసీ కెమెరాల అధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

YOU MAY LIKE