కావేరీ నది పుష్కరాలు ... !!

నేటి నుంచి కావేరీ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కావేరీనది పుష్కరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా పలు ఆధ్యాత్మిక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో జరుగుతుండడం విశేషం. మైసూరు సమీపంలోని ఘాట్‌లో కావేరీ పుష్కర మహోత్సవాన్ని దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి ప్రారంభించనున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు జయలక్ష్మి కల్యాణమండపంలో ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజన సదుపాయాలు కల్పించినట్లు అఖిల కర్ణాటక కమ్మవారి సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ వెల్లడించారు. 

YOU MAY LIKE