అరుదైన గౌరవం..

బ్రిటన్ ప్రధాని థెరిసా మే కు అరుదైన గౌరవం దక్కనుంది. లండన్ లోని వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఎర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ మైనపు విగ్రహలున్నాయి. మే..  విగ్రహాన్ని స్టీఫెన్ ఫీల్డ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ముఖం భాగం వరకు మాత్రమే పూర్తయింది.త్వరలో పూర్తి విగ్రహాన్ని ఏడాది ఆఖరున మ్యూజియంలో పెట్టనున్నట్లు మేడమ్‌ టుస్సాడ్స్‌ యాజమాన్యం తెలిపింది.