కంగనా రనౌత్‌కు నోటీసులు..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నోటీసులు అందాయి. తన సినిమాను హైజాక్‌ చేసిందని ఆరోపిస్తూ బాలీవుడ్‌ దర్శకుడు కేతన్‌ మెహతా కంగనాకు నోటీసులు పంపారు. ఆమె ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమాలో నటించాల్సి ఉంది.
అయితే 2015లోనే కేతన్‌ మెహతా కంగనాతో ‘రాణి ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా గురించి మాట్లాడారట. ఈ సినిమా చేయడానికి కంగనా ఒప్పుకుని ఇప్పుడు ఇదే కథపై వేరే దర్శకుడు, నిర్మాత తీస్తున్న సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో కేతన్‌ కోర్టును ఆశ్రయించారు.
‘ఇప్పుడు ఈ కేసును మా లాయరే చూసుకుంటారు. ఇంతటి గొప్ప సినిమా అందించడానికి పదేళ్లు కష్టపడాలి. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు యావత్‌ ప్రపంచం కోసం తీయాలనుకున్నాం. ఈ నోటీసులపై కంగనా ఇంకా స్పందించలేదు.’ అని వెల్లడించారు కేతన్‌.

YOU MAY LIKE