అధికారం కోసం..

BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ BJP సమన్వయకర్త రఘురామ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉపకరిస్తున్నాయన్నారు. మూడు రోజుల పాటు విజయవాడలో పార్టీ కార్యకర్తలు, నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమవుతారని రఘురామ్ తెలిపారు