కుమారుడిగా పుట్టడం నా అదృష్టం..

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాన్ని పఠించారు. హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్ట దైవమని, ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని, ఆ మహా దంపతులకు కుమారుడిగా పుట్టడం తన అదృష్టమన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో రాజమండ్రికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

YOU MAY LIKE