మరో పాట పాడిన 'రాశి'..!

 గతంలో 'జోరు' సినిమాలో ఓ పాట పాడిన రాశి, ఆ తర్వాత మలయాళ చిత్రం 'విలన్'లో కూడా ఓ పాట పాడింది. తాజాగా తనలోని గాయనికి మళ్లీ పనిచెప్పింది. నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న 'బాలకృష్ణుడు' చిత్రం కోసం ఓ పాట పాడింది. ఇందులో రోహిత్ సరసన తను కథానాయికగా నటిస్తోంది. ఈ పాట గురించి ఈ చిన్నది చెబుతూ, ఈ పాటను అభిమానులకు వినిపించాలని చాలా ఎగ్జయిటింగ్ గా వున్నానని, త్వరలోనే వినిపిస్తానని చెప్పింది.