షామిలి మళ్లీ వస్తోంది..!

 'అంజలి' సినిమాలో ఆ చిన్నారి చూపిన అభినయం అద్భుతం. తర్వాత సిద్ధార్థ్ తో కలసి 2008లో వచ్చిన 'ఓయ్' సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా ఫ్లాపవడంతో తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో మాత్రం కొన్ని సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో షామిలి తిరిగి ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ కి వస్తోంది. నాగశౌర్య హీరోగా నటించే ఓ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చింది. పవన్ సుందర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.