ఈ రికార్డు బాహుబలికే సాధ్యం..

బాహుబలి-2’ మరో ఘనత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని కలెక్షన్లతోదూసుకెళ్తున్న ఈ చిత్రరాజం రూ.1500కోట్ల వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. తొలి పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లు సాధించిన ఈ చిత్రం 22 రోజుల్లో రూ.1500కోట్ల మార్కును చేరుకుంది. భారత్‌లో రూ.1,227 కోట్లు, ఓవర్‌సీస్‌లో రూ.275 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.1,502కోట్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. బాహుబలి-2 హిందీలోనే దాదాపు రూ.500 కోట్లు సాధించినట్లు సమాచారం. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ‘బాహుబలి-2’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది.

ఈ సందర్భంగా దేవసేన, శివగామి పాత్రలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన ‘బాహుబలి’ చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యంలో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ నటించారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

YOU MAY LIKE