ఆస్ట్రేలియా సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం..

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు దూరమయ్యాడు. ఐదు వన్డేల సిరీస్ కు గాను తొలి మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ధావన్ కు చోటు కల్పించినప్పటికీ... తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో, టీమ్ నుంచి తనను రిలీజ్ చేయాలంటూ బీసీసీఐను ధావన్ కోరాడు. దీంతో, వెంటనే అతన్ని రిలీజ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయించింది. ధావన్ స్థానంలో ఇంకా ఎవరినీ సెలెక్టస్ చేయలేదు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డే నుంచి ధావన్ అర్ధాంతరంగా వైదొలగాడు. అప్పుడు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నరంటూ ధావన్ స్వదేశానికి చేరుకున్నాడు.

 

YOU MAY LIKE