యాపిల్ ఐ ఫోన్ 8 ... !!

యాపిల్ సంస్థ...ఐ ఫోన్ వినియోగదారులకు తీపికబురందించింది. ఐఫోన్ పదో వార్షికోత్సవం సంధర్భంగా  మరో మూడు కొత్త మోడల్స్ ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఐ ఫోన్లు సెప్టెంబర్ చివరి వారంలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.
మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ...ఐఫోన్ వినియోగదారులను ఆకర్షించేందుకు మూడు కొత్త  ఐ ఫోన్స్ ను  విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యాపిల్ పదో వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త, వినూత్న ఫీచర్లతో ఐఫోన్‌ టెన్‌ ను ఆవిష్కరించారు. దీంతో పాటు యాపిల్ ఐఫోన్ 8,8 ప్లస్ మోడళ్ళను విడుదల చేశారు. కొత్త మోడళ్లు ఈ నెల చివరి నుంచి మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయని సంస్థ CEO టిమ్ కుక్ ప్రకటించారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రీ బుకింగ్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ మోడల్స్ సెప్టెంబర్ 29 నుంచి భారత మార్కెట్ లోని అన్ని అధికారిక స్టోర్లలో అందుబాటులోకి  వస్తాయని యాపిల్ ఇండియా ప్రకటించింది..

YOU MAY LIKE