ప్రపంచ బ్యాంకు నిపుణులకు షాకిచ్చిన రాజధాని రైతులు..

పాలకులు ప్రజలను కంటి పాపల్లా చూడాలిసింది పోయి ప్రభుత్వమే చిన్న సన్నకారు రైతులకు కంట్లో నలుసులా మారి తమను తమ భూములపై ఆధారపడిన వ్యవసాయకూలీలను వేధిస్తోందని ఆయా గ్రామాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు  రాజధాని అమరావతి నిర్మించే గ్రామాలలో ఈ రోజు ప్రపంచ బ్యాంకు నిపుణులు పర్యటించిన సందర్భంగా మూడు పంటలు పండే తమపొలాల మీద తాము ,వ్యవసాయకూలీలు బ్రతుకు వేళ్ళ తీస్తుండగా రాజధాని నిర్మాణం పేరుతో తమ పంటచేలను పూలింగ్,లేదా భూసేఖరణ పేరుతో బలంతంగా గుంజుకొనే ప్రయత్నం ఏమిటని ?ఎవరికోసమని పలువురు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు.మాకు రూ.10 లక్షలు ఏకరాకి ఇచ్చి రూ50 నుండు కోటి రూపాయలకు అమ్మటానికి ప్రభుత్వం ఎవరని మహిళలు ప్రశ్నిస్తున్నారు.మూడు పంటలు పండించుకుంటూ తమ సంసారాలు వెళ్లదీస్తున్నామని,పొలాలు లాక్కుంటే తమపై ఆధారపడిన కూలీలు ఎక్కడకి పోతారని,ఇక్కడ రైతులకు,కూలీలకు అవినాభావ సంభందం ఉందని వారు ఎలా ఎక్కడ బ్రతుకుతారని రైతులు,మహిళా రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు.తమభూముల్లోనే ప్రాణాలయినా వదులుతామని అంతేగాని తమభూములు ఇచ్చేదే లేదని పలు గ్రామాల్లో బృందానికి తెగేసి చెప్పారు.ప్రజలపట్ల ప్రభుత్వం ప్రజారంజకంగా వుండాలేగాని ఇలా పీడించి వేధించటమేమట ని ప్రశ్నించారు.ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఆసాంతం ఈ ప్రాంత రైతులు చెప్పింది వివరంగా తర్జుమా చేయించుకుని మరీ విన్నారని ఆయా ప్రాంతాల్లోని రైతులు తెలిపారు.మా భూముల్లో ఎప్పుడు మూడు పంటలు పండుతాయి తక్కువ మొత్తంలో పండుతాయి అని చూపిస్తున్నారు.మా భూములు ఇవ్వమని మమ్మల్ని బేదిరిస్తున్నారు,ల్యాండ్ పూలింగ్,కు ఇవ్వలేదని భూమిని సేకరిస్తామంటున్నారు.కేవలం రిజిస్ట్రేషన్ చార్జీలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. బలవంతంగా  భూమిని సేకరిస్తామంటున్నారు.నష్ట పరిహారం విషయంలో జరీబుభూములకు,అసైన్డ్ భూములకు వత్యాసం చూపిస్తున్నారు.నది పరివాహక ప్రాంత భూముల్లో ఉన్న మా ఇళ్లను  కూల్చేశారు అని ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేసాడు.

YOU MAY LIKE