ముగిసిన అనిల్‌మాధవ్‌ దవే అంత్యక్రియలు..

 దివంగత కేంద్రమంత్రి అనిల్‌ మాధవ్‌ దవే అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. మధ్యప్రదేశ్‌లోని బంద్రభన్‌ నర్మదా నదీ తీరాన ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. దవేకు ఆయన సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన పార్థివ దేహానికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్రమంత్రులు హర్షవర్ధన్‌, ఉమాభారతి, అనంత్‌కుమార్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, థావర్‌చంద్‌ గెహ్లోట్‌, సీనియర్‌ ఆరెస్సెస్‌ జోషితో పాటు పలువురు నివాళులర్పించారు. దవే మృతికి సంతాపంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సంతాపదినాలుగా నిర్వహిస్తున్నట్లు సీఎం చౌహాన్‌ ప్రకటించారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన దవే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారు.

YOU MAY LIKE