" అంగరంగ వైభవంగా" .... అమరావతిలో !!

నవ్యంధ్ర రాజధాని అమరావతిలో వినాయకచవితి ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మందడం గ్రామంలో ఏర్పాటు చేసిన లంభోదరునికి గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలంలో 5 లక్షల రూపాయలకు మందడం గ్రామానికి చెందిన ఆలూరి నగేష్ దక్కించుకున్నారు. మేళతాళలతో కోయ నృత్యాలతో భక్తులు కనువిందు చేశారు. గ్రామోత్సవంలో కేరళ నుండి వచ్చిన సింగరి మేళం భక్తులను విశేషంగా అలరించింది

YOU MAY LIKE