జియోతో పోటీకి ఎయిర్‍టెల్ సై!

వరుస ఆఫర్లతో అతి తక్కువ సమయంలోనే వినియోగదారులను ఆకర్షించిన జియో సంస్థకు ఇప్పుడు ఎయిర్‍టెల్ పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసి౦ది. జియో అందించిన వీవోఎల్‍టీఈ వాయిస్ కాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ సంస్థ అయిన‌ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు కూడా వీవోఎల్‌టీఈ సదుపాయాన్ని కల్పించడానికి సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు ఈ సదుపాయాన్ని జియో మాత్రమే అందిస్తోంది. మిగిలిన నెట్‍వర్కులు 2జి, 3జి కాల్స్ పైనే ఆధారపడుతున్నాయి. 

వచ్చేవారం ముంబయిలో వివోఎల్‍టీఈ సేవలను ఎయిర్‍టెల్ ప్రారంభించనుంది. ముందుగా ప్రధాన మెట్రో నగరాలకు తరువాత మిగిలిన ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

YOU MAY LIKE