ఇక నుంచి దర్శకత్వం..

వెండితెరపై రొమాంటిక్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన కధానాయకులలో ఒకరు అరవింద్ స్వామి. ఈ మధ్యనే ఆయన తన రీఎంట్రీతో సినీప్రియులను అబ్బురపరిచారు. తన వయస్సుకు తగ్గ పాత్రలను చేయడమే కాకుండా... కథలో కీలకమున్న పాత్రలను చేసి భళా అనిపించుకున్నారు.
అయితే అరవింద్ స్వామి త్వరలో ఓ మోగా ఫోన్ పట్టాలనుకుంటున్నాడనేది కోలీవుడ్ లో హాట్  టాక్ గా మారింది. తనలో దాగి ఉన్న దర్శకత్వ పటిమను నిరుపించుకోవాలని అనుకుంటున్నాడట. తనకు అభిరుచి కలిగిన సినిమాలు తీయాలనే  ఆలోచనలో స్వామి వున్నాడని టాక్.. అయితే ఇప్పుడు నాలుగు తమిళ సినిమాలలో బిజిగా ఉన్న స్వామి.. అవి పూర్తవగానే దర్శకత్వం పనిపడతాడనే  ప్రచారం జోరుగా సాగుతుంది.. మరీ అందులో వాస్తవం ఎంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచివుండాల్సిందే.